భరత్ అనే నేను మూవీ హైలైట్స్ సీన్స్ చూస్తే ఈమాట ఖచ్చితంగా అంటారు…

భరత్ అనే నేను మూవీ హైలైట్స్ సీన్స్ చూస్తే ఈమాట ఖచ్చితంగా అంటారు…
కొరటాలశివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, నిజంగా గ్రామాలను దత్తతు తీసుకునేలా ఈ సినిమా ఇన్స్పైర్ చెయ్యడంతో సనచాలనాన్ని సృష్టించింది.

అయితే మహేష్ నటించిన గత రెండు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో ఆయన ఫాన్స్ కొంత నిరుత్సాహంలో ఉన్నా, ఇప్పుడు సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవ్వలని, అవుతుందని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అందరికి అనిపిస్తుంది.

ఇకపోతే ఈ సినిమాలో కొన్ని హైలెట్ సీన్స్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటి వలన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఆ సీన్స్ ఏమిటో తెలుసుకుందాం

ఈ సినిమాలో లో అసెంబ్లీలో వచ్చే సీన్స్ చాలా హైలెట్ గా ఉంటాయంట. ప్రతిపక్ష నాయకులు తన మీద ఆరోపణలతో దాడి చేసినప్పుడు గణాంకాలతో సహా మహేష్ తిప్పి కొట్టే సీన్ థియేటర్ లో మారుమోగిపోతుందని అంటున్నారు.

కైరా అద్వాని గురించి కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. తనతో లవ్ ట్రాక్ రెగ్యులర్ సినిమాల తరహాలో ఎక్కువ సేపు కాకుండా ఎంత అవసరమో అంత వరకే పెట్టేసి తను చెప్పాలనుకున్న మెసేజ్ ని చెప్పడం చెప్పారని అంటున్నారు.

అలాగే దేవరాజ్-ప్రకాష్ రాజ్ పాత్రలు సినిమాలో చాల కీలకం గా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

సినిమాకు దేవి బ్యాక్ గ్రౌండ్ కూడా హైలెట్ అని అంటున్నారు.
ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సీఎం ఒక్కరుంటే చాలు అని అందరూ అంటారని చిత్ర యూనిట్ అంటున్నారు.

Prev postPage Next post

Leave a Reply

*