ఈ నెల 8నే బాలయ్య అభిమానులకు పండుగ…

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ గా వస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే.  క్రిష్‌ దర్శకత్వంలో బాలయ్య 100 వ సినిమా అయిన ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. అయితే మరి 8 న అభిమానులకు పండగ ఏమిటని అనుకుంటున్నారా? అవును అది తెలియాలంటే ముందు ఇది తెలుసుకోవాలి.అదేమిటంటే…

‘‘ఆనాడు శాతకర్ణి తన విజయపరంపరకు ప్రతీకగా ఒకే రోజు, ఒకే సమయంలో దేశంలోని కోటలన్నింటిపైనా శాతవాహన పతాకం ఎగురవేయించాడు. ఆ రోజే ఉగాది అయ్యింది. ప్రతి రాష్ట్రంలోనూ వేర్వేరు పేర్లతో ఇప్పటికీ పండుగలా జరుపుకొంటున్నారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనెల 8న ‘శాతవాహన పతాకోత్సవం’ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న వంద థియేటర్లలో ఒకేసారి శాతవాహన పతాకం ఎగరేస్తారు. ఆ రోజు సాయంత్రం 5గం.40 నిమిషాలకు విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్‌ వద్ద ఈ జెండా పండుగని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, క్రిష్‌తో పాటు మిగిలిన చిత్ర బృందం పాలుపంచుకోనుంది. మిగిలిన 99 థియేటర్లలో అభిమానులే ఈ వేడుక నిర్వహిస్తారు.

Prev postPage Next post

Leave a Reply

*