బాహుబలి2 రివ్యూ రేటింగ్ 4/5 … హైలెట్ సీన్స్ ఇవే…

ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూసే బాహుబలి2 సినిమా అతికొద్ది గంటల్లో మన ముందుకు వచ్చేస్తుంది. ఈసినిమా ఈరోజు రాత్రి ముంబైలో బాలీవుడ్‌ ప్రముఖుల కోసం ప్రీమియర్‌ షో వేస్తున్నారు. కాని ఇప్పటికే ఈ సినిమా టాక్, రివ్యూ బయటకి వచ్చింది. ఉందని సెన్సార్‌ బోర్డు సభ్యుడొకరు ‘డీఎన్‌ఏ’ పత్రికతో ఈ సినిమా గురించి ఇలా రివ్యూ ఇచ్చారు…

బాహుబలి కంటే ఈ సినిమా కొంచెం ఎక్కువసేపు ఉంటుందని, అంటే దాదాపు 3 గంటల ఉంటుంది. కాని సినిమాలో ఎక్కడా కూడా టైం తెలియడంట. సింగిల్‌ ఫ్రేమ్‌, షాట్‌, డైలాగుల్లో ఒక్క పదం కూడా కట్‌ చేయలేదు. ఒక్క కట్‌ కూడా చెప్పలేదు. పోరాట సన్నివేశాలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్‌ కంటే సూపర్‌గా ఉన్నాయి. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 8 కంటే కూడా బాగున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా హ్యాపీగా ఫీలవుతార’’ని తెలిపారు.

ప్రభాస్‌, రానా పోటీపడి నటించారని ప్రశంసించారు. ‘రెండు సింహాలు దీటుగా తలపడినట్టు వీరిద్దరూ నటించారు. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారు. అయితే కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే విషయం మాత్రం చెప్పను అని చెప్పారు. అయినా ఎందుకె కొన్ని గంటలు ఆగితే మనకే అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో, మరియు అసలు రివ్యూ రేటింగ్ తెలుస్తుంది…

Prev postPage Next post

Leave a Reply

*