బాహుబలి 2 ప్రేక్షకుల రివ్యూ…రేటింగ్

సినిమా…బహుబలి2

తారాగణం : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా..

సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి

దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి

నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.

ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న బాహుబలి 2 ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఎలాంటి ఎమోషనల్ సీన్స్ లేకుండా కేవలం పాత్ర పరిచయాల కోసమే కేటాయించిన బాహుబలి తొలి భాగం భారీ విజయం సాధించటంతో అసలు కథ నడిచే బాహుబలి 2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. దర్శకధీరుడు రాజమౌళి…  ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క లు ప్రధాన పాత్రలుగా తీర్చిదిద్దిన ఈ సినిమా చూసేందుకు అందరు ఎంత ఆశక్తిగా ఉన్నారో చెప్పనక్కరలేదు. అయితే ఇన్ని కోట్ల మంది అంచనాలని బాహుబాలి 2 ఇలా రీచ్ అయ్యిందో చూద్దాం…

కథ :

మొదటి భాగంలో బాహుబలిని రాజుగా ప్రకటిస్తుంది శివగామి దేవి. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లో శివగామి వంశపార పర్యంగా వచ్చిన ఆనవాయి ప్రకారం ఆమె నెత్తిపై ఒక కుండను పెట్టి అది యాగంలో కలపడానికి నడిచి వెళ్తుంది. అప్పుడు ఏనుగు వచ్చి అందరిని బెదిరించగా కట్టప్పను ప్రజలను కాపాడమని తనను వదిలేయమంటుంది శివగామి. రాజమాత ఆజ్ఞా కాదనలేని కటప్ప ఆపనిలో ఉండగా అప్పుడు హీరో ప్రభాస్ వచ్చి తల్లిని ఏనుగు నుంచి కాపాడతాడు. అలా హీరో ఎంట్రెన్సు అవుతుంది. ఆ తరవాత రాజుగా ప్రకటించిన తరువాత దేశంలోని పరిస్థితులను తెలుసుకొని రమ్మని బాహుబలి కి కట్టప్పను తోడుగా ఇచ్చి దేశాటనకు పంపిస్తుంది శివగామి దేవి. అలా బయటకు వెళ్ళిన బాహుబలి అనుష్కాను చూసి, ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను జయించేందుకు అమాయకుడిలా, సామాన్యుడిగా ఆమె రాజ్యంలో చేరుతాడు.

అయితే ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకు భల్లాలదేవుడు కూడా దేవసేనను సొంతం చేసుకోవాలనుకుంటాడు. బాహుబలి ప్రేమ విషయం రాజమాతకు చెప్పక ముందే తాను దేవసేనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఎలాగైన దేవసేనతో తన వివాహం జరిపించాలని శివగామి దగ్గర మాట తీసుకుంటాడు. కొడుకు కోరికను మన్నించిన శివగామి, దేవసేనను తన కొడలిగా చేసుకోవాలని భావిస్తున్నాని వర్తమానం పంపుతుంది. అయితే శివగామి వర్తమానం పంపిన తీరు నచ్చని దేవసేన, శివగామి పంపిన బహుమతులను తిప్పిపంపుతుంది. కానీ కుంతల రాజ్యంలోనే ఉన్న బాహుబలి, కట్టప్పలు మాత్రం రాజమాత… దేవసేనకు బాహుబలితో వివాహం చేయించనుందని భావిస్తారు. ఆ నమ్మకంతోనే నీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదని మాట ఇచ్చి దేవసేనను మాహిష్మతికి తీసుకువస్తాడు. మాహిష్మతికి వచ్చిన తరువాత అసలు నిజం తెలుస్తుంది.

దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా తల్లి తీసుకున్న నిర్ణయం పై తప్పుపడతాడు బాహుబలి. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామి దేవి, భల్లాలదేవుడిని రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైన రాజమాతకు దూరం చేయాలనుకున్న భల్లాలదేవుడు, తండ్రి బిజ్జలదేవుడితో కలిసి కుట్రలు పన్ని బాహుబలి, దేవసేనలపై అంతఃపుర బహిష్కరణ శిక్ష వేయిస్తాడు. కోటకు దూరమైన బాహుబలి.. సామాన్యులతో కలిసి ఉంటూ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు.

అక్కడ కూడా ప్రజలలో బాహుబలికి మంచిపేరు రావడం భరించలేని భళ్ళార బాహుబలి మామా అని ఆప్యాయంగా పిలుచుకునే కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడు. అసలు బాహుబలిని చంపడానికి కట్టప్ప ఎందుకు అంగీకరించాడు…? భల్లాలదేవుడు చేసిన మోసాలు రాజమాత శివగామి దేవికి తెలిసాయా..? భల్లాలదేవుడు శివగామిని ఎందుకు చంపాలనుకున్నాడు..? మహేంద్ర బాహుబలి, భల్లాలదేవుడ్ని ఎలా అంతమొందించాడు.? అన్నదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే…

ఈ సినిమాలో యుద్ధం సీన్స్ సూపర్. హాలీవుడ్ సినిమాలను చూసినట్టు అనిపిస్తుంది. ఇక ప్రభాస్ ఇంతకాలం ఎదురుచూసి, ఇక ఇ సినిమా చేయకుండా చేసినందుకు ప్రతిఫలం దక్కింది. ఇక ఈ సినిమాలో పెంపుడు తల్లి కొడుకుల బంధం బాగుంది. అయితే ఇదే ప్రభాస్, రాజమౌళి, బానుప్రియ ల కాంబినేషన్ లో వచ్చిన చత్రపతి లో కూడా ఇదే సెంటిమెంట్ ని చూపించాడు రాజమౌళి. చత్రపతి సామాన్యుడి సినిమా తీస్తే, ఇందులో రాజుల కథ తీసాడు. అక్కడ మాత్రం ఆ సెంటిమెంట్ వాడాడు రాజమౌళి. కాని పెంపుడు తల్లి కొడుకుల ప్రేమ ఆ ఫీల్ చత్రపతిలోనే చాలా బాగా పండిందని అనిపిస్తుంది.

అయితే ఈ సినిమాలో కేవలం ప్రేమలు, సెంటిమెంట్స్ చూపిస్తే చాలదు. వాటితో పాటు రాజరికపు గంభీరం కూడా చూపాలి కదా. ఇక ప్రభాస్ అనుష్కాల మద్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది. అనుష్కా యుద్ద ప్రతిభ రాణి రుద్రమదేవిలో చూసేసాం కాబట్టి కొత్తగా అనిపించదు. కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవుడిగా నాజర్, ఇతన నటీనటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తమన్నా క్లైమాక్ష్ లో మాత్రమె కనిపిస్తుంది. బాహుబలి విజయంలో కీలక పాత్ర పోషించిన మరో అంశం గ్రాఫిక్స్. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏ మాత్రం తీసిపోని గ్రాఫిక్స్‑తో ఈ సినిమాను తెరకెక్కించారు. కీరవాణి మ్యూజిక్ కూడా హైలెట్. కాని పాటలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఏదిఎమైనా ఒక ఆలోచనను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఐదేళ్లపాటు తపస్సు చేసిన రాజమౌళి అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

రేటింగ్-4/5

Prev postPage Next post

Leave a Reply

*