భాగమతి సినిమా రివ్యూ మరియు రేటింగ్, సినిమాలో ఈ సీన్స్ సూపర్…

టైటిల్ : భాగమతి

జానర్ : థ్రిల్లర్‌

తారాగణం : అనుష్క, ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, ఆశా శరత్‌, మురళీ శర్మ

సంగీతం : తమన్‌.ఎస్‌

దర్శకత్వం : జి. అశోక్‌

నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌

అశోక్‌ తొలిసారిగా తన స్టైల్‌ మార్చి చేసిన సినిమా భాగమతి. అరుంథతి, రుద్రమదేవి, పంచాక్షరి లాంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకున్న అనుష్క లీడ్‌ రోల్‌ లో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌ సినిమా ఇది. ఈ సినిమా పై భారీ అంచనాలతో అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎంతగా మెప్పించిందో తెలియాలంటే కథలోకి వెళ్దాం…

కథ…

చంచల (అనుష్క) ఓ ఐఏఎస్ అధికారి. మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయకుమార్) వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుంది. సామాజిక కార్యకర్త శక్తి (ఉన్ని ముకుందన్)తో ప్రేమలో పడుతుంది. రైతుల సంక్షేమం మంత్రి ఈశ్వర ప్రసాద్ చేపట్టిన ప్రాణధార ప్రాజెక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుంది. కానీ ఓ కారణంగా ప్రియుడు శక్తిని కాల్చి జైలుకెళ్తుంది. జైలులో రిమాండ్‌లో ఉన్న చంచలను ఓ ఆపరేషన్ కోసం భాగమతి బంగ్లాకు తరలిస్తారు. బంగ్లాలోకి ఎంటర్‌ అయిన తరువాత చంచల వింతగా ప్రవర్తిస్తుంది. తనను ఎవరో కొడుతున్నారని అరుస్తూ, అప్పుడప్పుడూ అరబిక్‌ భాషలో మాట్లాడుతూ పోలీసులను భయపెడుతుంది. చెంచల అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి..? మినిస్టర్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ మీద మచ్చ వేయాలన్న కుట్ర ఎందుకు జరిగింది..? చెంచల తన ప్రియుడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఈ సమస్యల నుంచి చెంచల ఎలా బయటపడింది..?ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

సినిమా ఎలా ఉందంటే…

అరుంథతి, రుద్రమదేవిగా చరిత్ర సృష్టించిన అనుష్క భాగమతి మరోసారి అదే స్థాయి పర్ఫామెన్స్ తో అదరగోట్టింది. భారీ కథ కాకపోయినా.. అద్భుతమైన టేకింగ్‌, థ్రిల్లింగ్‌ విజువల్స్‌లో ఆడియన్స్‌ను కట్టి పడేశాడు. ముఖ్యంగా భాగమతి బంగ్లాలో జరిగే సన్నివేశాలు వావ్ అనిపిస్తాయి. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ పార్ట్‌ లు పార్ట్‌ లుగా రావటం. కొన్ని జరగని సన్నివేశాలు జరిగినట్టుగా భ్రమ కలిగించటంతో ఆడియన్స్‌ కాస్త తికమక పడే అవకాశం ఉంది. హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాకు మరో మేజర్‌ ప్లస్ పాయింట్‌ తమన్ మ్యూజిక్‌, తమన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. కానీ సెకండాఫ్‌లో కథపై పట్టుకోల్పోయాడనే భావన కలుగుతుంది. అనుష్క ఇమేజ్‌ చట్రంలో బందీ అయ్యాడా అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే కథ, కథనంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అయితే భాగమతి బంగ్లాలో జరిగే సన్నివేశాలు మాత్రం సూపర్ అనేలా తీసాడు. సినిమా మొత్తం మీద డైరక్టర్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

రేటింగ్=3/5


Prev postPage Next post

Leave a Reply

*