సరైనోడు 54 కోట్ల సునామీ

సరైనోడు పవర్ చూపిస్తున్నాడు. స్ట్రాంగ్ కాదు.. సూపర్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి వసూళ్లు. రెండో వారాంతంలో కూడా కలెక్షన్స్ కుమ్మేయడంతో.. ఇప్పటికే సేఫ్ జోనర్ లోకి వచ్చేశాడు అల్లు అర్జున్ సరైనోడు. బోయపాటి దర్శకత్వంలో బన్నీ నటించిన ఈ మూవీనీ ప్రపంచవ్యాప్తంగా 54 కోట్లకు విక్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 10వ రోజుకే ఈ 54 కోట్ల మొత్తాన్ని ”షేర్” రూపంలో లాగేసి బాక్సాఫీస్ కి సరైనోడు అనిపించుకున్నాడు బన్నీ. సరైనోడుకి నైజాం నుంచి 13.97 కోట్ల షేర్ వసూళ్లు రాగా – సీడెడ్ నుంచి 8.18 కోట్లు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైజాగ్ ఏరియాకి 5.52 కోట్లు – ఈస్ట్ 3.54 కోట్లు – వెస్ట్ 3.10 కోట్లు – కృష్ణా 2.84 కోట్ల కలెక్షన్స్ రాగా.. గుంటూరు 3.87 కోట్లు – నెల్లూరు నుంచి 1.64 కోట్లువచ్చాయి.

మొత్తంగా ఏపీ – తెలంగాణల నుంచి 42.66 కోట్లు వసూలు చేసి.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించాడు సరైనోడు. కర్నాటక 6.65 కోట్లు – రెస్టాఫ్ ఇండియా 1.30 కోట్లు – అమెరికా 2.83 కోట్లు – ఓవర్సీస్ 0.80 కోట్ల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా 54.24 కోట్లు కొల్లగొట్టి.. సేఫ్ జోనర్ లోకి వచ్చేయడంతో.. బయ్యర్లు – డిస్ట్రిబ్యూటర్లు ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. చాలా ఏరియాల్లో ఇప్పటికే ప్రాఫిట్ జోనర్ లోకి ఎంటర్ అవడం ఈ వారం కూడా సత్తా చాటుతుండడంతో.. సరైనోడుతో లాభాల పంట ఖాయం అయిపోయింది.

Prev postPage Next post

Leave a Reply

*