అలా దోచుకోవడానికి పవన్ కళ్యాణ్ గ్యాంగ్ పర్మీషన్ అడుగుతోంది

పవర్ స్టార్ సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగ. సినిమా హిట్ అవుతాదా లేదా అన్నది తర్వాత సంగతి. అభిమానులు మాత్రం దాన్ని ముందే హిట్ చేసేస్తారు. పవన్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తారు. దీంతో రిలీజ్ రోజే సినిమా చూడాలన్న ఆతృత కొందరిదైతే…. టికెట్ ఎంతైనా సరే డోంట్ కేర్. బెనిఫిట్ షోకు పరుగులు తీసేవారు ఇంకొందరు. ఇటు సినీ నిర్మాతలు కూడా ఫ్యాన్స్ కుండే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉంటారు.

తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న పవన్ మూవీ అజ్ఞాతవాసి. దీంతో ఈ సినిమాకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకొనే పనిలో పడ్డారు ప్రొడ్యూసర్లు. పవర్ స్టార్ అజ్ఞాతవాసి మూవీ టికెట్ ధరను 200 వరకు పెంచేందుకు వీలు కల్పించాలంటూ… ప్రొడ్యూసర్లు… ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అప్లికేషన్ పెట్టాయట. బాహుబలి 2 మూవీ విషయంలో కూడా ఇదే చేసారు నిర్మాతలు. కానీ తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో…. టికెట్ ధరలు పెరగలేదు.

అయితే ఏపీలో బాబు సర్కార్ మాత్రం టికెట్ రేట్స్ హైక్ చేసేందుకు ఓకే చెప్పేసింది. దీంతో బాహుబలికి రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిసింది. బాహుబలి 2 లాంటి సినిమాలకు టికెట్ ధర పెంచారంటే ఓ అర్థంఉంది. ఎందుకంటే దానికి పెట్టిన భారీ బడ్జెట్…. డైరెక్టర్…. యాక్టర్ల కష్టాం అలాంటిది. దీంతో ఆడియన్స్ కూడా టికెట్ ధర పెరిగినా పెద్ద భారంగా ఫీలవ్వకుండా భరిస్తారు. కాని అజ్ఞాత వాసి అలా కాదు. మామూలు సినిమాల్లానే… రెగ్యులర్ కమర్షియల్ ఫ్యామిలీ మూవీ. ఒక హీరో, ఇద్దరు హీరొయిన్లు, విలన్ గ్యాంగ్, ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్. ఇంతే. మరి దీనికి ప్రత్యేకంగా డబ్బులు ఎందుకు ఇవ్వాలి ? ఇటు పవర్ స్టార్ కూడా ఇలాంటి వాటిని ఎంటర్ టైన్ చేయకూడదని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ . ఇలాంటి పనులతో పైరసీ కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెక్స్ టేపుల వివాదం మళ్ళీ…? అసలు కథ ఏమిటంటే…

సెక్సానందగా వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కిన నిత్యానందతో కలిసి రంజిత తిరుమలలో దర్శనమివ్వడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. సినీ నటి రంజిత “మా ఆనందమయి”గా పేరు మార్చుకున్న విషయం విదితమే. రంజితతో కలిసి నిత్యానంద రాసలీలలు.. అంటూ ఓ వీడియో తెరపైకి రావడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా రంజిత, నిత్యానంద వార్తల్లో వ్యక్తులుగా మారారు.

నిత్యానంద చుట్టూ అనేక వివాదాలు మొదలయ్యాయి. వివాదాల కారణంగా నిత్యానంద ఆశ్రమాల్లో పోలీసులు సోదాలు నిర్వహించడం, ఆయనపై పలువురు గృహిణులు “వేధింపు” ఆరోపణలు చేయడం జరిగాయి. కాని అప్పుడు పోలీసుల విచారణలో “అసలు నేను మగాడ్నే కాదు” అని నిత్యానంద చెప్పడంతో పెద్ద సెన్సేషన్ అయ్యింది. స్వామి నిత్యానందకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో బయటకు రావడంతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒకప్పటి హీరోయిన్‌ రంజిత, ఆయన ఏకాంతంగా కలిసి ఉన్న దృశ్యాలు దక్షిణాదిలోని టీవీ చానెళ్లు పదేపదే ప్రచారం చేశాయి.

అయితే అందులో ఉన్నది వాళ్ళు కాదని, మార్ఫింగ్‌ జరిగిందని కోర్టు మెట్లు కూడా ఎక్కారు.  ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా వీడియో ఉన్నది వీరిద్దరేనని తాజాగా నిర్ధారించడంతో నిత్యానంద, రంజిత వాదన అబ్ధమని తేలిపోయింది. రంజిత అసలు పేరు శ్రీవల్లి. సినిమాలో ఎంటర్ అయినప్పుడు రంజిత అని పేరు మార్చుకుంది. ఆమె వాలీబాల్‌ క్రీడాకారిణి కూడా. ఈమె సినిమాలలో మంచి అగ్రహీరోయిన్ గా వెలిగింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. ఆర్మీ మేజర్‌ రాకేశ్‌ మీనన్‌ సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్‌ రాకేశ్‌ మీనన్‌తో ఆమె వివాహమైంది.అప్పుడు ఆమె సినిమాలకు కొంతకాలం దూరం అయ్యి, మళ్ళీ వచ్చింది. 2007లో భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. చివరిసారిగా 2010లో మణిరత్నం ‘రావణన్‌’ సినిమాలో కనిపించింది.

తరవాత మళ్ళీ స్వామి నిత్యానందతో ఏకాంతంగా గడిపిన వీడియో బహిర్గతం కావడంతో రంజిత పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది. 2013, డిసెంబర్‌ 27న సన్యాసం స్వీకరించి ఆనందమయిగా పేరు మార్చుకుంది. ఈమె నిత్యానంద ఆశ్రమంలోనే సన్యాసినిగా జీవితం గడుపుతుంది.

Prev postPage Next post

Leave a Reply

*