అజ్ఞాతవాసి దుబాయ్ రివ్యూ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి కోసం ఫాన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం వచ్చేసింది. రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ ని చూస్తుందని పవన్ ఫాన్స్ ఆశిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్, టీజర్ మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. వీటిని బట్టి చూస్తే, సినిమా ఇలా ఉండవచ్చని అనుకుంటున్నారు. ఓ గొప్పింటి బిడ్డ అయిన హీరో అభిజిత్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ఏదో వెతుక్కుంటూ వెళ్తాడు. రాజకుమారుడే అయినా ప్రవాసిగా తిరుగుతుంటాడు. అయితే అది ఎందుకు అసలు కథ ఏంటి అన్నదే అజ్ఞాతవాసి సినిమా. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు త్రివిక్రం శ్రీనివాస్ అభిమానులకు ఈ సినిమా మంచి రిజల్ట్ ఇస్తుందని అంటున్నారు.

సినిమా కథను చూపించకుండా సినిమా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కుర్చీ డైలాగ్ తో చూపించాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాన్ స్టైల్.. త్రివిక్రం డైలాగ్స్, డైరక్షన్ తో పాటుగా కీర్తి సురేష్ అభినయం.. అను ఇమ్మాన్యుయెల్ అందం సినిమాకు ఆకర్షణగా ఉంటాయని తెలుస్తుంది. ఇక అనిరుద్ మ్యూజిక్ కూడా సినిమాలో మరో క్రేజీ థింగ్ అని అంటున్నారు. మొత్తం మీద సినిమా సూపర్ డూపర్ హిట్ కోడతుందని అందరి అంచనా.

కొద్ది సేపటిక్రితమే అమెరికా, దుబాయ్ లో అజ్ఞాతవాసి ప్రీమియర్ షోలు పడ్డాయి. అప్పుడే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఈ మూవీ ఫస్ట్ రివ్యూ ను తెలియజేసాడు. గతం లో ఎలాగైతే తన రివ్యూ లతో సినిమాల ఫై అంచనాలు పెంచాడో..ఈ చిత్రం ఫై కూడా అంతే విధంగా ఇచ్చి , మరింత హైప్ తెచ్చాడు. సినిమా ఫస్ట్ హాఫ్ ఒక తీరుగా , సెకండ్ హాఫ్ ఒకతీరు గా ఉందని , పవన్ నుండి ఏమైతే కోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో ఉన్నాయని తెలియజేసాడు.

Prev postPage Next post

Leave a Reply

*