రామసేతు గురించి సంచలన నిజాలు బయటపెట్టిన అమెరికా…

రామాయణం మానవ జీవితానికి దొరికిన గొప్ప వరం. అందులోనుంచి మానవులు నేర్చుకోవలసిన ఎన్నో నీతి సంఘటనలు ఉంటాయి. ఆ సీతారాముల కథ ఎన్నిసార్లు విన్నా ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటుంది. అరణ్యంలో కూడా ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండే తీరు, రాముడికి సీతపై ప్రేమ మరియు ఏక పత్నీవ్రతుడై ఉండటం వలన మానవజాతికి ఆదర్శపురుషుడిగా ఆ శ్రీరామచంద్రుడు నిలిచాడు. అలాగే భర్తకు దగ్గరగా ఉన్నా లేక దూరంగా ఉన్నా, అతడిని దైవం లా పూజించే ఆ తల్లి, అగ్నిలో దూకి మరీ స్త్రీ జాతి గౌరవాన్ని చిరకాలం నిలిపింది.

సీతమ్మను వెతుక్కుంటూ రాముడు వెళ్ళేటప్పుడు, స‌ముద్రంపై క‌ట్టిన రామ‌సేతు గురించి పురాణంలో ఎంతో గొప్పగా రాసారు. అయితే ఈ వార‌ధి నిర్మాణాన్ని త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధితో స‌హా ఎంతో మంది ఎద్దేవా చేశారు. కాని ఆ వారధి గురించి కొన్ని నిజాలు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాయి. సీత‌మ్మ‌త‌ల్లిని ద‌క్కించుకోవ‌డానికి శ్రీరామ‌చంద్రుడు స‌ముద్రంపై క‌ట్టిన రామ‌సేతు కేవలం పుక్కిటి పురాణం కాద‌ని తాజాగా అమెరికాకు చెందిన ఓ సైన్స్ చానెల్ క‌థ‌నం ప్ర‌సారం చేసింది.

ఈ వారధి గురించి తెలుసుకునేందుకు భార‌త్‌, శ్రీలంక మ‌ధ్య‌లో ఉన్న వంతెన‌పై శాస్త్ర‌వేత్త‌లు 30 మైళ్ల వ‌ర‌కు పరిశోధ‌న‌లు సాగించారు. ఈ ప‌రిశోధ‌న‌ల ఫ‌లితంగానే ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని ఆ చానెల్ పేర్కొంది.

అందులో రామాయణం నిజంగానే జ‌రిగింద‌ని, దాదాపు ఏడు వేళ్ల ఏళ్ల క్రితం ఈ వార‌ధి నిర్మాణం జ‌రిగింద‌ని డిస్క‌వ‌రీ నెట‌వ‌ర్క్‌కు చెందిన సైన్స్ చాన‌ల్ ధ్రువీక‌రించింది. రామేశ్వ‌రానికి చాలా దూరం నుంచి సున్న‌పురాళ్ల‌ను తీసుకొచ్చి స‌ముద్రంపై ఈ వంతెన నిర్మించారని తెలిపింది. నీటి మీద తేలే ఈ రాళ్ల‌కు ఇసుకను క‌లిపి చాలా దృఢంగా ఈ సేతువును నిర్మించార‌ని పేర్కొంది. 

 

Prev postPage Next post

Leave a Reply

*