ఇంట్లో ఈ పని గాని చేస్తే, భవిష్యత్తులో అన్నం కూడా దొరక్కుండా పోతుంది!

ప్రతీ ఒక్కరికి అనేక మంచి చెడు అలవాట్లు ఉంటాయి. కొన్ని నియమనిభందనలు ఉంటాయి. అయితే కొందరు కొన్ని తెలిసీ తెలయక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన లేనిపోని సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. పొద్దున్న నిద్ర లేవగానే ఆరోజుని అనుభవించేందుకు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడని, ఆ రోజు మొదలుపెట్టాలని అనుకోవాలి. పొద్దున్న లేచిన వెంటనే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అలా చేయడం వలన కొన్నాళ్ళకు అన్నం కూడా దొరకనంత దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుందని అంటారు. అసలు పొద్దున్న లేవగానే ఏ పనులు చేయకూడదో, ఏ పని చేస్తే మంచిదో తెలుసుకుందాం…

చేయకూడని పనులు…

1.పొద్దున్న లేవగానే అద్దం ముందుకు వెళ్లి చూసుకోకూడదు.

2.పళ్ళు తోముకోకుండా కాఫీ, టీ తాగకూడదు.

3.ఇంట్లో, బయట అటు ఇటూ తిరుగుతూ పళ్ళు తోమకూడదు. ఎవ్వరు చూడకుండా పళ్ళు తోముకోవాలి.

4.పళ్ళు తోముకోకుండా, లేవగానే వంటగదిలోకి వెళ్లి వంట పని మొదలు పెతకూడదు.

5.జుట్టు విరబూసుకుని ఉన్న భార్యని చూడకూడదు.

6.పొద్దున్న లేవగానే క్రూర జంతువుల ఫోటోలను చూడకూడదు.

7.నుదుటిన బొట్టు లేని స్త్రీని చూడకూడదు.

చేయవలసిన పనులు…

1.నిద్ర లేవగానే భూదేవతకు నమస్కారం చెయ్యాలి.

2.వేదమంత్రాలు చదివే బ్రాహ్మణుడిని చూడటం మంచిది.

3.గోవుని గాని, తులసి మొక్కని గాని చూడటం మంచిది.

4.సముద్రం, గుడి గోపురం, పర్వతం ఇలాంటివి చూసినా మనకు శుభం కలుగుతుంది.

5.బంగారం, సూర్యుడు, దూడతో ఉన్న ఆవుని కూడా చూడటం మంచిది.

6.లేవగానే అరచేతిని చూస్తే మంచిది.

7.దీపం, హోమం చూసినా కూడా మంచిది.

8.మగవారు తమ భార్య మొఖం చూస్తే మంచిది…

Prev postPage Next post

Leave a Reply

*