భారతదేశం మొత్తాని ఆకర్షిస్తున్న గుజరాత్ ఎన్నికల ఫైనల్ సర్వే రిపోర్ట్ అత్యంత సన్నిహితులతో లగడపాటి పంచుకున్నాడంటూ… ఒక సర్వ్ రిపోర్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. పెద్దనోట్ల రద్దు, GST పై వ్యతిరేకత, పటేల్ల పోరాటం, దశాబ్దాలగా అధికారంలో ఉండడం వలన వచ్చిన ప్రబుత్వ వ్యతిరేకత ఇవన్నీ ఎదుర్కొంటూ… మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో జరగతున్న ఎన్నికలు మోడీకి బిజెపికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అటువైపునుండి దేశావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నది అన్న విషయమే ప్రజలు మరిచిపోయే స్థితి నుండి పోటీ ఇచ్చేస్తాయికి కాంగ్రెస్ ఎదగడం బిజెపిని కలవరపెడుతున్నది.
మొత్తం 182 స్థానాలకుగానూ మొదటి దశలో 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. 72.02 శాతం పోలింగ్ నమోదైనట్లు గుజరాత్ రాష్ట్రం యొక్క చీఫ్ ఎన్నికల అధికారి బీబీ.స్వావిన్ ప్రకటించారు. ఈనెల 14న రెండో విడత పోలింగ్ జరగనుండగా.. 18వ తేదిన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 2.11 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఈసారి బిజెపికి ప్రతికూలత ఎదురైనా విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాదిస్తుందని సర్వ్ లో వెల్లడైందంట.
ఏబీపీ-సీఎస్డీఎస్ కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించగా… 50 నియోజకవర్గాల్లో 3,655 మంది ఓటర్లతో సర్వే జరపగా… బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 43 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. 182 అసెంబ్లీ స్థానాలకి గాను బీజేపీకి 91-99 సీట్లు, కాంగ్రెస్ కు 78-86 సీట్లు వస్తాయని ఆ సర్వే తేల్చింది. 22ఏళ్లుగా అధికారంలో ఉంది బీజేపీ మరోసారి ఎన్నికల్లో గెలుపొందనున్నదని ఈసంస్థ తేల్చింది. బిజెపిని గుజరాత్ లో దెబ్బకొట్టి తిరిగి పుంజుకోవాలని ఆశపడుతున్న కాంగ్రెస్ కలలు, కల్లలాగానే మిగాలనున్నాయి.
Related posts:

















