హిందు శ్లోకాల్లో ఆశ్చర్య పరిచే విఙ్ఞానం! ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం…

 భారత దేశం ఎంతో  గొప్పదని  అందులో ఎంతో జ్ఞానసంపద ఉందని మనం చిన్నప్పటి నుంచి చదువుతూ, వింటూనే ఉన్నాము. ఎంతటి జ్ఞానసంపద ఉందంటే మనం ఎంత చదివినా, విన్నా అది ఆ మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువు వంటిదనే అనుకోవాలి. అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒకటి రెండు మెతుకులు చూస్తే చాలు, అలాగా మన ఙ్ఞానసంపద ఎంత గొప్పదో ఒప్పుకోవడానికి ఈ రెండు శ్లోకాలు చూస్తే చాలు.

  1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం
  2. గాయత్రి మంత్రం…

ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి …

 “యుగ సహస్ర యోజన పర భానూ!

లీల్యోతాహి మధుర ఫల జానూ”!!

దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…

యుగ= 12,000 దివ్య సంవత్సరములు

సహస్ర=1000

యోజన్= 8 మైళ్ళు

యుగ x సహస్ర x యోజన= పర్ భాను

12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు

1 మైళు = 1.6 కిలో మీటర్లు

96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =

153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)

హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి, అది తినే పండు అనుకుని ఆ సూర్యుడినే అందుకుందామని భూమి నుంచి ఆకాశానికి వెళ్ళాడని అనగా సూర్య మండలానికి చేరాడని మన ఇతిహాసాలు చెప్పిన విషయంలో ఉన్న నిజాన్ని గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.

  1. గాయత్రి మంత్రం… గాయత్రీ మంత్ర మహిమ గురించి అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్కలేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…

గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు. గాయత్రీ మంత్రం చదివినా లేక వినినా కూడా, మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవించి మానసిక వికాసం కలుగుతుందని పరిశోధనల్లో కూడా తెలుస్తుంది.

ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు చదవటం లేదా వినటం  చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.

అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకున్న ఈ గొప్ప సంపదని ఇతర దేశస్థలు కూడా గుర్తించడమే కాకుండా పాటిస్తున్నారు కూడా. ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్విద్దాం. మన వర్తమాన, భవిష్యత్ తరాలకు కూడా చాటి చెబుదాము .

gayathri hanuman

Prev postPage Next post

Leave a Reply

*