మార్వాడీల ల ధనవంతులు కావాలంటే ఇలా…

ధనం అంటే అందరికి ప్రీతికరమే. అందుకే ఆ ధనలక్ష్మి ఆదరణ పొందాలని అందరూ పరితపిస్తారు. దానికి తగ్గట్టు కష్టపడతారు. అయితే జరిగే పనుల్లో అవాంతరాలు రావడం, అనుకోని ఖర్చులు ఎదురవ్వడం, దాచిన నిలువ ఖర్చైపోవడం ఇలా అందరికి ఏదో ఒక రకమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి కష్టాల నుంచి ఉపసమనం పొంది, ధనం సంపాదించాలంటే… మార్వాడీలు ఆచరించే కొన్ని చిట్కాలను పాటించడం వలన మనం కూడా ధనవంతులం కావచ్చు.

అసలు మనకు చిక్కులతో కూడిన కష్టాలు రావడానికి కారణం శని ప్రభావం, అందుకే ఆ శనిని తృప్తి పరిచే పని మనం చేస్తే కొంతవరకు ఉపసమనం కలుగుతుంది. శనికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. ఆరోజు గుర్రపు నాడే బాగా అరిగిపోయిన ఇనుము తెచ్చుకుని, దానిని లక్ష్మి దేవి ఎదురుగా పెట్టి, పూజ చేసి దానిని గోడకు కొట్టాలి. బయటకు వెళ్ళేటప్పుడు దానికి దండం పెట్టుకోవాలి ఇలా చేయడం వలన వెళ్ళిన పనులు సక్రమంగా జరుగుతాయి. ఇంకా అదే పూజ చేసిన గుర్రపు నాడే ని కంకణంగా కాని, ఉంగరంగా  గాని చేసుకుని ధరించినా మంచి జరుగుతుంది. మార్వాడీలు ఇలానే చేస్తారు. ఇలా చేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

Prev postPage Next post

Leave a Reply

*