డిసెంబర్ 14న ఈ విదంగా పూజా చేస్తే మీరు కుబేరులే |

కార్తీకమాసం పూర్తి అయిన వెంటనే మార్గశిర మాసం మొదలవుతుంది. కార్తీకమాసం అంతా శివకేశవులను పూజిస్తే, ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం. లక్ష్మీదేవిని పూజించే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. పూజ చేసే సమయంలో తల విరబూసుకుని చేయకూడదు. అలాగే ఈ మార్గశిర మాసంలో ప్రతీరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మివారాలు అని కూడా అంటారు.

భక్తిశ్రద్దలతో అమ్మవారిని ఈ మాసంలో పూజిస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారిని పూజించేటప్పుడు తడిపొడి బట్టలతో పూజ చెయ్యరాదు. హారతి, నైవేద్యం లేకుండా పూజ పూర్తికాదు. అలాగే అమ్మవారికి ఇష్టమైనవి సమర్పించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనవి, పసుపు, కుంకుమ,అక్షింతలు,గంధం,మంచి సువాసన వచ్చే సాంబ్రాణి, తెల్ల కలువ పువ్వులు, తామర పువ్వులు, పాలు, పాలతో చేసే నైవేద్యాలు అమ్మవారికి చాలా ఇష్టం.

అమ్మవారికి తామరపువ్వంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అలాగే చంద్రుడు లక్ష్మీదేవికి స్వయంగా సోదరుడు. చంద్రుడికి వెండి లోహం అంటే చాలా ఇష్టం. కావున వెండి తో చేసిన తామర పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు సైజ్ చూసుకుని సమర్పించ వచ్చు. మంగళ,గురు,శుక్ర వారాలలో అమ్మవారికి ఈ వెండి పూలు సమర్పిస్తే మంచిది. అలాగే మార్గశిర మాసంలో గురువారం నాడు వెండి పూలు అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా అదృష్టం అని చెబుతున్నారు. ఇంకా వివరంగా ఈ క్రింది వీడియోలో…

 

Prev postPage Next post

Leave a Reply

*