బట్టలు గాని ఇలా ఉతికితే, దరిద్రం పట్టి వదలదు…

 నిత్యం మనం చేసే పనులలో కొన్ని పనులు కొన్ని రోజుల్లో అస్సలు చేయకూడదు. అలా చేయడం వలన ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోతుందని అంటారు. పెద్దలు చెబుతున్నా కూడా, కొందరు పరవాలేదని మాట వినకుండా అలా చేస్తూనే ఉంటారు. అలా చేయడం వలన అస్సలు మంచిది కాదు. ఇంతకీ అవేమిటో తెలుసుకుందాం…

1.ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి గా భావిస్తాం. అలాంటి గుమ్మాన్ని కాలితో అస్సలు తొక్క కూడదు. అలాగే గుమ్మం పైన కూర్చోకూడదు. అటు ఇటు కళ్ళు వేసి కూడా నిలబడకూడదు. ఒకవేళ పిల్లలు తెలియక చేస్తే, పెద్దలు చెప్పి అలవాట్లు మార్పించాలి.

2.ఇంట్లో మనం పిల్లల తలకి కొబ్బరి నూనె రాస్తాం. అయితే ఒకరికి రాసి, అదే చేత్తో రెండవ వాళ్లకి రాస్తాం. దీని వలన ఇంట్లో లక్ష్మిదేవి నిలబడదు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు.

3.బట్టలు ఉతుకుతాం. కాని వాటిని ఉదయం పూట మాత్రమే ఉతకాలి. సాయంత్రం సమయంలో అస్సలు బాటలు ఉతకకూడదు. అలాగే మంగళవారం, శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో బట్టలు ఉతకకూడదు.

4.స్నానం చేసి ఒళ్ళు తుడుచుకిని, ఉతికిన బట్టలు వేసుకున్న తరవాతనే, పనులు స్టార్ట్ చెయ్యాలి.

5.తడికాళ్ళతో రాత్రుళ్ళు, బెడ్ పైనా పడుకోరాదు. ఇంట్లో ఎప్పుడు శుభకరమైన మాటలే మాట్లాడాలి. చెడు మాట్లాడితే ఎక్కువగా చెడే జరుగుతుంది.

ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు…

Prev postPage Next post

Leave a Reply

*