భార్యకు కూడా తెలియకుండా ఇలా చేస్తే, ధనప్రాప్తి కలుగుతుంది…

ధనవంతులు అవ్వాలని జీవితంలో అందరూ అనుకుంటారు. అయితే ఆ ధనాన్ని సంపాదించడానికి ఒకొక్కరు ఒకొక్క విధానాన్ని, మార్గాన్ని ఎన్నుకుంటారు. కొందరు బాగానే సంపాదిస్తారు. కాని వారికి ఎంత సంపాదించినా నిలబడదు. అలాగే మరికొందరు. ఎంత ప్రయత్నించినా సంపాదించలేదు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోలేక, జీవితం పై నిరాశ పెంచుకుంటూ ఉంటారు. వీటన్నిటికి కారణం, లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడమే. అందుకే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇలా చేయాలి…

ప్రొద్దుటే లేచి ఇంటిని శుభ్రపరచుకుని,  తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దాంతో పాటు ఐదు కర్పూరం బిల్లలను తీసుకుని ఒక ఎర్రగుడ్డలో మూటగట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తితో దూపం వేయాలి. తరువాత తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్ధిస్తూ పూజించాలి. ఆ తర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇలా పూజ ముగిసిన తరవాత, లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకుని బీరువాలో మనం ఎక్కడైతే డబ్బు, బంగారాన్ని దాచుతామో ఆ ప్రదేశంలో ఉంచాలి.

అయితే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. చివరికి భార్యకి కూడా చెప్పకూడదు. ఇలా చేస్తే అష్టయిశ్వర్యాలతో తులతూగడం ఖాయమంటున్నారు జ్యోతిష్యులు.

Prev postPage Next post

Leave a Reply

*