బంధుమిత్రుల తో వైరం లేకుండా, నరదిష్టికి దూరంగా…సక్సెస్ అవ్వాలంటే…

మనకు ఎంతో మంది శత్రువులు ఉంటారు. శత్రువులు అంటే పెద్ద పెద్ద గొడవలు, గోలలు అని కాదు. బంధువర్గంలో కాని, స్నేహితులలో కాని, మన పైఅధికారులలో కాని ఎవరో ఒకరిలో మన పై శత్రుత్వం పెరుగుతుంది. అది మన ఎదురుగా చూపించకపోవచ్చు. కొందరు బయటకు చూపిస్తారు. మరికొందరు లోపలే ఉంచుకుంటారు. ఎలా అయినా కూడా ఇతరులతో మనకు శత్రుత్వం మంచిది కాదు. దాని వలన అనేక నష్టాలు, కష్టాలను ఎదుర్కుంటాం తప్పితే ఇంకేమి లాభం లేదు.

బయటకు కోపాన్ని చూపిస్తే, మనకు అర్ధం అవుతుంది. అలాంటి వారి కోపాన్ని తగ్గించడానికి, మనం ఏదైనా చెయ్యవచ్చు. కాని బయటకు చూపించకుండా కోపం పెంచుకునే వారి గురించి మనకు అస్సలు తెలియదు. తెలిసి గాని, తెలియకుండా గాని మనం చేసిన తప్పుల వలనో, ఎదుటివారి నైజం వలనో మనం శత్రువులం అవుతాం. అలాంటి శత్రువులను దూరం చేసుకుని, వారిని మిత్రులుగా మార్చుకుంటే జీవితం చాలా హాయిగా ఉంటుంది. అదెలానో తెలుసుకుందాం…

ఒక పౌర్ణమి రోజున 5 లవంగాలను తీసుకుని, వీటిని దుర్గమ్మ ముందు పెట్టండి. ఆమె పాదాల దగ్గర వాటిని పెట్టి అమ్మా మాకు ఎవ్వరు శత్రువులు లేకుండా చూడు తల్లి, మమ్మల్ని రక్షించు అని దండం పెట్టుకోండి. ఆ తరవాత వాటిని తీసి ఒక పసుపు గుడ్డలో కట్టి, ఆడవారు తమ బ్యాగ్ లో మగవారు వారి పర్సులో పెట్టుకుంటే మంచిది. ఇలా 6 పౌర్ణమిలకి చేస్తే మీకు శత్రువుల నుంచి ఎలాంటి నరదిష్టి కాని, నష్టం గాని కలుగదు.

Prev postPage Next post

Leave a Reply

*