పెళ్లి ఖర్చును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకిచ్చిన ఆదర్శ జంట గురించి

ఈరోజుల్లో పెళ్ళంటే మామూలు సందడి కాదు. డబ్బున్న వాళ్ళ పెళ్ళంటే మరీను. పెళ్ళంటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు అనేవారు. ఇప్పుడు అల మూడుతోనో ఎడుతోనో సింగల్ డిజిట్ నంబర్లతో పనులు అవ్వవు. మూడు ముళ్ళు, ఏడు అడుగులతో పాటు కొన్ని లక్షలు, స్తోమత ఉంటే కోట్లు కావాల్సి వస్తున్నాయి. పూర్వం కట్నం ఇవ్వడానికి అమ్మాయి తల్లి తండ్రులు, జీవితం నిలబెట్టడానికి అబ్బాయి తల్లితండ్రులు తెగ సతమతమయ్యేవారు కాబట్టి ఇంత ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేయలేకపోయేవారు. కాని ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా బాగా చదువుకుని, పెళ్ళికి ముందే ఉద్యాగాలు చేసుకుంటూ వాళ్ళ ముచ్చట్లు కొంత వరకు వాళ్ళే తీర్చుకుంటున్నారు. ఖరీదైన బట్టలు, బ్యూటీ పార్లర్లు, మండపం డెకరేషన్, భోజనాలు, కళ్యాణమండపం , ఖరీదైన పెళ్లి కార్డులు ఇలా ఎన్నో… ఈ ఖర్చుతో కొన్ని జీవితాలు కొన్ని సంవత్సరాలు బ్రతికేయవచ్చు.

అయితే ఈ జంట మాత్రం పెళ్లి చేసుకుని, వేడుక అంటే మన ఆడంబరం మాత్రమే కాదు ఎందరికో కలిగించే ఆనందం అని నిరూపించారు. ఇండియన్ సివిల్ సర్వీస్ కు ఎంపికైన అభర్, IDBI బ్యాంక్  మేనేజర్ గా పనిచేస్తున్న ప్రీతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం… వీరిద్దరూ ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నారు. అయితే వీళ్ళ పెళ్లి మాత్రం ఏ హంగూ ఆర్భాటం లేకుండా చాల సింపుల్ గా చేసుకోవాలని నిర్ణయించుకుని, ఆ డబ్బులతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

అదే విధంగా ఓ 10 రైతు కుంటుంబాలకు ఒక్కోక్క కుటుంబానికి 20 వేల చొప్పున మొత్తం 2 లక్షల రూపాయలను అందించారు. అంతే కాకుండా 52 విలువైన కాంపిటేటివ్ బుక్స్ ను కొనుగోలు చేసి నాగ్ పూర్ లోని….వివిధ లైబ్రరీలకు ఉచితంగా అందించారు. పెళ్లికి వచ్చిన అతిథులకు సింపుల్ గా చపాతీ, వెజ్ కర్రీ పెట్టి పంపించారు. ఇంత ఆదర్శంగా పెళ్లి చేసుకుని, పది మంది రైతు కుటుంబాలను కాపాడిన ఈ జంట పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం. అందరికి తెలియజేసి అనంతమైన ఆశీస్సులు వాళ్లకు కానుకగా అందిద్దాం.

Prev postPage Next post

Leave a Reply

*